వంద కేజీల గంజాయితో ముగ్గురి అరెస్ట్
బుచ్చెయ్యపేట : కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం బుచ్చెయ్యపేట ఎస్‌ఐ ఎ. శ్రీనివాసరావు ముందస్తు సమాచారంతో చెరకు కాటా వద్ద నాలుగు గంటల ప్రాంతంలో వాహనాలు ఆపి తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో ఆర్‌జే 14సిటి3439 నంబర్ గల కారులో ఆపగా అందులో ఉన్న డ్రైవర్ ముందు, వెనక సీట్లో కూర్చున్న వ్యక్తులు పారిపోబోయారు. వారిని పట్టుకుని కారును తనిఖీ చేయగా, 100 కేజీల గంజాయి బయటపడింది. గంజాయితో రాజస్థాన్ ప్రాంతానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఒడిశా రాష్ట్రం పాడువ గ్రామంలో లక్ష రూపాయలకు గంజాయిని కొని తరలిస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. కారును, మూడు సెల్ పోన్లు, గంజాయిని సీజ్ చేసి కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. నిందితులను చాకచాక్యంగా పట్టుకున్న సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్. శ్రీనివాసరావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
14 కిలోల గంజాయి స్వాధీనం
నాతవరం: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్టు నాతవరం ఎస్‌ఐ సీహెచ్.భీమరాజు తెలిపారు. మండలంలో వల్సంపేట, నాతవరం మధ్య రోడ్డులో శనివారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో ఈ మార్గంలో వచ్చిన ముగ్గురు బ్యాగ్‌లను పరిశీలించగా గంజాయి బయటపడిందని చెప్పారు. అల్లూరి సీతారామారాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం లక్కవరపుపేట పంచాయతీ శివారు పోతురాజుగుమ్మల గ్రామానికి చెందిన గెమ్మిల రమేష్, తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎ.రాజేష్, కన్నిరాజ్‌లను అరెస్టు చేసి, వారి నుంచి 14 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.70వేలు ఉంటుందన్నారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని, కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment