విశాఖ సిటీ: సింహాచలంలో సహజ సిద్ధ జలధారల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వీఎంఆర్‌డీఏ కమిషనర్ కె.ఎస్.విశ్వనాథన్ పేర్కొన్నారు. శనివారం వీఎంఆర్‌డీఏ సమావేశ మందరింలో సింహాచలం శ్రేణుల్లో జలధారల పరిరక్షణపై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జలధారల పరిరక్షణకు సంబంధించి ధాన్ ఫౌండేషన్‌తో వీఎంఆర్‌డీఏ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అనంతరం కమిషనర్ విశ్వనాథన్ మాట్లాడుతూ సుస్థిర పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటించారు. ధాన్ ఫౌండేషన్ ప్రతినిధి లోకేష్ మాట్లాడుతూ సింహాచలం కొండ ప్రాంతాల్లో 34 జలధారల్లో 18 ధారలను మ్యాపింగ్ చేసినట్లు చెప్పారు. ఇంకా నీటి వనరులు గుర్తించేందుకు స్థానిక గిరిజన వర్గాల సహకారాన్ని తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సింహాచలం దేవస్థానం ఈవో వి.త్రినాథరావు మాట్లాడుతూ ఆలయ ఆచారాలతో పాటు పర్యావరణానికి ఈ జలధారలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment