‘కిశోరి వికాసం’ అందరి కర్తవ్యం
తుమ్మపాల : పిల్లలను లింగ వివక్ష చూపకుండా పెంచాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. బుధవారం స్థానిక ఎస్‌ఆర్ శంకరన్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘కిశోరి వికాసం’ జిల్లా స్థాయి శిక్షకుల శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాల బాలికల హక్కులను గూర్చి తెలుసుకుని గ్రామస్థాయికి తీసుకువెళ్లాలన్నారు. బాలికల పట్ల ఎటువంటి వివక్ష చూపించకుండా చదువు చెప్పించాలన్నారు. వారు ఆర్ధికంగా స్థిరపడిన తరువాత మాత్రమే వివాహం జరిపించాలన్నారు. బాల్య వివాహాలు జరిపే వారిని ముందుగానే గుర్తించి నివారించాలన్నారు. బాలికలకు పౌష్టికాహారం అందించి, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా పెరిగేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. పిల్లలు వారి సందేహా లను, సమస్యలను తల్లిదండ్రులతో చెప్పుకునే స్వే చ్ఛను ఇవ్వాలన్నారు. నైతిక విలువలు నేర్పాలని, ఓటములను తట్టుకొనే మానసిక స్థయిర్యం కల్పించాలని అన్నారు. పని ప్రదేశాల్లో సీ్త్రలపై వేధింపులకు పాల్పడినా, బాడీ షేమింగు చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ స్థాయిలో అధికారులు ప్రజలకు కిశోరి వికాసంపై అవగాహన కల్పించాలన్నారు.
పిల్లలపై చదువుల ఒత్తిడి...
అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు మాట్లాడుతూ బాలబాలికలు చదువుల లక్ష్యంతో మానసిక ఒత్తిడిలో ఉంటున్నారని, కుటుంబ సభ్యులు వారికి సమయం కేటాయించాలన్నారు. వారి సమస్యలను బయటివారితో పంచుకొనే అవకాశం కల్పించకుండా కుటుంబ సభ్యులు చర్చించి పరిష్కరించుకో వాలని తెలిపారు. పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయులు చొరవ తీసుకుని ధైర్యం చెప్పి, చదువులు కొనసాగించేలా ప్రోత్సహించాలన్నారు. డీఎల్‌డీఓ ఎస్.మంజులవాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు కె.అనంతలక్ష్మి, జిల్లా బా లల సంరక్షణ అధికారి ఎం.రమేష్, డాక్టర్ క్రాంతి, దిశ ఎస్‌ఐ రాములమ్మ, యోగ రిసోర్స్ పర్సన్ డాక్టర్ శ్రీనివాసరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, సెర్ఫ్, మెప్మా, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఇంటర్మీడియట్ అధికారులు పాల్గొన్నారు.
లింగ వివక్షను రూపుమాపాలి
నేటి బాలలే రేపటి దిశానిర్దేశకులు
సీ్త్రకి ఆర్థిక స్వాతంత్య్రం ఉండాలి
కలెక్టర్ విజయ కృష్ణన్
Comments
Please login to add a commentAdd a comment