విశాఖలో హైకోర్టు బెంచ్‌పై సుప్రీం సీజేకు వినతి
విశాఖ లీగల్: విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుప్రీంకోర్టు న్యాయవాది జి.కృష్ణస్వామితో కలిసి వినతి పత్రం అందిచినట్లు హైకోర్టు సాధన సమితి కన్వీనర్ ఐఎం అహ్మద్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా కూడా ఒక ఫిర్యాదును సుప్రీంకోర్టుకు పంపినట్లు పేర్కొన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు అని చెప్పి విశాఖను పరిపాలనకు ఎంపిక చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో హైకోర్టు బెంచ్ కోసం ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదన్నారు. సీనియర్ న్యాయవాది గొలగాని అప్పారావు కూడ హైకోర్టు బెంచ్ విశాఖలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment