టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు

Published Mon, Nov 25 2024 8:20 AM | Last Updated on Mon, Nov 25 2024 8:20 AM

టీడీప

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు

కొత్తనాగయ్యపేటలో పైపులైన్‌,

సీసీ రోడ్డు ధ్వంసం

సర్పంచ్‌ ఫిర్యాదు చేసినా

పట్టించుకోని పోలీసులు

తాగునీరు సరఫరా కాక అవస్థలు

దేవరాపల్లి: టీడీపీ నాయకులు, సానుభూతిపరులు రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా అడిగేవాడే లేడు అన్న ధైర్యంతో బరితెగిస్తున్నారు. మండలంలోని నాగయ్యపేట పంచాయతీ పరిధిలోని కొత్తనాగయ్యపేటలో స్థానిక టీడీపీ సానుభూతిపరులు కొందరు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. సుమారు రూ.40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన మంచినీటి ట్యాంక్‌కు చెందిన పైపులైన్‌ను పొక్లెయిన్‌తో పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో వారం రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఇది జరిగి వారం రోజులు కావస్తున్నా సంబంధిత గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇదే విషయమై స్థానిక సర్పంచ్‌ కర్రి పుష్ప లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. గ్రామానికి చెందిన అల్లు దేముడు, అల్లు దేముడమ్మ, అల్లు గంగునాయుడు తదితరులు పొక్లెయిన్‌తో పైపులైన్‌ ధ్వంసం చేశారని సర్పంచ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అల్లు గంగునాయుడు సూచనలతోనే పైపులైన్‌ ధ్వంసం చేశారని, ఈ విషయమై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.

నామరూపాల్లేకుండా...

గ్రామంలో రామాలయానికి ఆనుకుని ఉన్న సీసీ రోడ్డును సైతం ధ్వంసం చేశారు. 50 మీటర్లమేర నామరూపాలు లేకుండా చేశారు. రోడ్డును పెచ్చుపెచ్చులుగా చేయడంతో రాకపోకలకు గ్రామస్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసినా పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికార్లు పట్టించుకోక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం సరి కాదంటూ విమర్శిస్తున్నారు. ధ్వంసంచేసిన వారు టీడీపీ సానుభూతిపరులు కావడంతోనే చర్యలు తీసుకునేందుకు అధికారులు భయపడుతున్నారని స్థానికలు తెలిపారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

రామాలయానికి ఆనుకుని ఉన్నవీధిలో సీసీరోడ్డును కొందరు పొక్లెయిన్‌తో పూర్తిగా తవ్వేశారు. సిమెంట్‌ కాంక్రీట్‌ పెచ్చులు పైకి తేలాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్డును దౌర్జన్యంగా తవ్విస్తే అధికార్లు పట్టించుకోక పోవడం దారుణం. ఇలాంటి విష సంస్కృతి గ్రామంలో ఎన్నడూ లేదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.

– తమటపు శంభునాయుడు, కొత్త నాగయ్యపేట.

కుళాయి నీరు రాక అవస్థలు

మంచినీటి ట్యాంక్‌ పైపులను కొంత మంది ధ్వంసం చేశారు. దీంతో సుమారు వారం రోజులుగా కుళాయి నీరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఇంటింటా కుళాయిలు ఉన్నా చేతి బోర్ల నుంచి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దౌర్జన్యంగా పైపులైన్‌ ధ్వంసం చేసి వారం రోజులు కావస్తున్నా, అధికార్లు పట్టించుకోక పోవడం దారుణం.

– కడారి మంగ కొత్త నాగయ్యపేట గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు 1
1/3

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు 2
2/3

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు 3
3/3

టీడీపీ సానుభూతిపరుల బరితెగింపు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement