సీకార్
కారు చిచ్చు
ఏటికొప్పాకలో పాలసేకరణ కేంద్రం వద్ద ఆదివారం మధ్యాహ్నం నిలిపి ఉంచిన కారు దగ్ధమైంది. బండిమాంబ అమ్మవారి జాతరకు గాజువాక నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన కారులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించా యి. స్వల్పంగా పేలుళ్లు సంభవించినట్టు స్థానికులు తెలిపారు. యలమంచిలి రూరల్ ఎస్‌ఐ ఎం.ఉపేంద్ర ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు.కారు యజమానితో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఈ కారును 6 నెలల క్రితమే కొనుగోలు చేసినట్టు,దాని విలువ సుమారు 15 లక్షలుగా తెలిపారు. ప్రమాద సమయంలో దట్టమైన పొగ, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు, భయాందోళనకు గురయ్యారు. – యలమంచిలి రూరల్
రేవుపోలరం తీరానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. అధిక సంఖ్యలో తరలిరావడంతో రద్దీ వాతావరణం ఏర్పడింది. ఇసుక తిన్నెల్లో ఉదయం నుంచి విహరించి, తీరంలో జలకాలాడుతూ సందడి చేశారు. సమీప జెట్టీపైకి ఎక్కి సంద్రం అందాలను వీక్షించి, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. తీరం సమీపంలోని తోటల్లో వన భోజనాలు చేసి, లక్ష్మీమాధవ స్వామి, మినీ కై లాస్ గిరిపై గౌరీ పరమేశ్వరులను, షిరిడీ సాయి నాథుని దర్శించుకున్నారు. – ఎస్.రాయవరం
Comments
Please login to add a commentAdd a comment