● ఉత్తరాంధ్రలో తుది ఓటర్లు 19 వేల మంది ● పోలింగ్ కేంద్రాలు, సిబ్బందిపై కసరత్తు
మహారాణిపేట (విశాఖ): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా ఉన్న పాకలపాటి రఘువర్మ పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికావడంతో పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది, ఇతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు 123 పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఒక పోలింగ్ స్టేషన్ ఉండేలా ప్రతిపాదించి, ఎన్నికల కమిషన్‌కు పంపారు. నామినేషన్ల స్వీకరణ విశాఖ కలెక్టర్ కార్యాలయంలోనే జరగనుంది. వచ్చే నెల 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి మొదటి వారంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఓటర్ల జాబితా ప్రకటన
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను గత నెల 30న అధికారికంగా ప్రకటించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19,523 మంది ఓటర్లుండగా ఈసారి స్వల్పంగా పెరిగి, 21,555 మందికి చేరింది. ఇందులో 12,948 మంది పురుషులు, 8,607 మంది సీ్త్రలు ఉన్నారు. అనకాపల్లి జిల్లాలో 2,802 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448 మంది, విశాఖ 5,277, శ్రీకాకుళం 4,829, విజయనగరం 4,937, మన్యం పార్వతీపురం జిల్లాలో 2,262 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment