విశాఖ సిటీ: ‘క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. చిన్న వారిని కాదు.. పెద్ద చేపలపైనే గురి పెట్టాం. ఈ కేసులో రాజకీయ నేతలు, పోలీసులు.. ఇలా ఎవరి ప్రమేయం ఉన్నా వదిలే ప్రసక్తే లేద’ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. మంగళవారం పోలీస్ సమావేశ మందిరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ బెట్టింగ్ కారణంగా రూ.లక్షలు పోగొట్టుకొని అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పే ర్కొన్నారు. ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నామని, సైబర్ క్రైమ్ ద్వారా లోతుగా దర్యాప్తు జ రుగుతోందని చెప్పారు. సాంకేతికత, కొత్త సాఫ్ట్‌వేర్ల సాయంతో విచారణను వేగవంతం చేశామని వివరించారు. ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేయ గా.. వారు ఇచ్చిన సమాచారంతో అనేక బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు.
మరో ఇద్దరు అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మందిని పట్టుకున్న పోలీసులు మంగళవారం మరో ఇద్దరు బుకీలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి ద్వారా మరికొంత మంది బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీల సమాచారాన్ని సేకరించారు. వారి కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఇప్పటి వరకు నిందితుల సమాచారంతో కొన్ని బ్యాంకు ఖాతాల ను పరిశీలించగా.. రూ.178 కోట్ల మేరకు బెట్టింగ్ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పెద్ద చేపలపైనే గురి
రాజకీయ నేతలు, పోలీసులు ఎవరినీ వదిలేది లేదు
80 బ్యాంక్ ఖాతాల ద్వారా రూ.178 కోట్ల లావాదేవీలు
విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి
Comments
Please login to add a commentAdd a comment