కూటమి ఫ్లెక్సీలకు కోడ్ వర్తించదా?
నక్కపల్లి: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూటమి నేతలకు వర్తించదేమో..! అధికారుల వైఖరి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. మార్చి వరకు ఎన్నికల కోడ్ ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రామాలు, పట్టణాల్లో వివిధ పార్టీ నేతల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, కాటౌట్లు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను నక్కపల్లి మండల అధికారులు అమలు చేయడం లేదని పలువురు ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. నక్కపల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఉన్న ఫ్లెక్సీలు ఇప్నటి వరకు తొలగించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఈ ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment