నిరుద్యోగులు, మహిళలకు ఆశాజనకంగా..
ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనిస్తూ, ఎగుమతుల ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ప్రశంసనీయం. క్రెడిట్ పరిమితిని రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు, స్టార్టప్‌లకు రూ.10 కోట్లకు పెంచడంతో పాటు వృద్ధిలో ఉన్న ఎంఎస్‌ఎంఈ ఎగుమతిదారులకు టర్మ్ లోన్ ను రూ.20 కోట్లకు పెంచడంతో ఈ రంగాలకు పెట్టుబడి, వర్కింగ్ క్యాపిటల్ బలోపేతమవుతాయి. యువతను సన్నద్ధం చేసేలా 5 నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు ఏర్పాటు అభినందనీయం. గ్లోబల్ స్కిల్లింగ్ భాగస్వామ్యాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏఐ ఏర్పాటు ఉండటం నిరుద్యోగులు, మహిళలలో నైపుణ్యాన్ని పెంచుతుంది. – కంకటాల మల్లికార్జునరావు, ఫ్యాప్సీ ప్రెసిడెంట్
రెండు దశాబ్దాల తర్వాత గణనీయమైన సవరణ
దాదాపు 20 ఏళ్లలో మొదటిసారిగా వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబ్‌లలో గణనీయమైన సవరణను సూచించారు. ఈ నిర్ణయంతో ఈ బడ్జెట్ చారిత్రాత్మకమైందిగా నిలిచిపోతుంది. ఇది మధ్య తరగతికి ఒక పెద్ద ప్రోత్సాహకం. ఈ పన్ను ఆదా ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో సహాయ పడటమే కాకుండా ఎక్కువ ఆర్థిక సౌలభ్యాన్ని కూడా ఇస్తుంది. వ్యవసాయ రంగానికి అనేక ప్రగతిశీల కార్యక్రమాలు ప్రవేశపెట్టడం ప్రశంసనీయం.
–సుధీర్ ములగాడ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment