జాతీయ స్ఫూర్తి ఉట్టిపడేలా గణతంత్ర వేడుకలు
సాక్షి, అనకాపల్లి: జాతీయ స్ఫూర్తి ప్రస్ఫుటించేలా 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆమె రిపబ్లిక్ డే ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 26న అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో నిర్వహించనున్న వేడుకల నిర్వహణకు నిర్దేశించిన మినిట్ టు మినిట్ ప్రొగ్రాంను అనుసరించి సంబంధిత శాఖలు సమన్వయంతో సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీ, వీఐపీ, ఇతర ప్రజాప్రతినిధులు, సాధారణ ప్రజానీకానికి తగు విధంగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జాతీయత, సమగ్రత ఉట్టి పడేలా సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించాలని, వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలకు సంబంధించిన స్టాళ్లను, శకటాలను ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, డీఆర్వో వై.సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం ఆర్డీవోలు షేక్ ఆయిషా, వి.వి రమణ, ఏఎస్పీ దేవప్రసాద్, సీపీఓ జి.రామారావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ విజయ కృష్ణన్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment