ఆర్టీసీకి సంక్రాంతి ఆదాయం రూ.కోటి
అనకాపల్లి: ఈ ఏడాది సంక్రాంతిని పురస్కరించుకుని అనకాపల్లి, నర్సీపట్నం డిపోల నుంచి నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా రూ.కోటి ఆదాయం వచ్చినట్లు ప్రజా రవాణాశాఖ జిల్లా అధికారి కె.పద్మావతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి డిపో నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, పాయకరావుపేట, వియనగరాలకు, నర్సీపట్నం డిపో నుంచి హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, విశాఖలకు ఈనెల 10 నుంచి 20వ తేదీ వరకు 200 ట్రిప్పులు నడిపామని, సుమారు 50 వేల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చామన్నారు. 119 శాతం ఆక్యుపెన్సీ రేషియో సాధించి అనకాపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ప్రయాణికులు ఈ ఏడాది ఆర్టీసీ బస్ సేవలను బాగా వినియోగించుకున్నట్లు ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment