జిల్లాలో పలు చోట్ల వర్షాలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో పలు చోట్ల వర్షాలు

Published Sat, May 25 2024 4:40 PM

జిల్లాలో పలు చోట్ల వర్షాలు

అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. కణేకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, ఉరవకొండ మండలాల్లో 40 – 50 మి.మీ వర్షపాతం నమోదైంది. శెట్టూరు, బొమ్మనహాళ్‌, యాడికిలో 20 నుంచి 30 మి.మీ, అనంతపురం, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, పుట్లూరు, పెద్దవడుగూరు, కంబదూరు తదితర మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది.

నేడు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన

తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్‌కు మళ్లిపోవడంతో రాగల ఐదు రోజులు పొడి వాతావరణం ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త జి.సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్‌ శాస్త్రవేత్త జి.నారాయణస్వామి తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement