అనంతపురం కార్పొరేషన్: అనంతపురంలోని రైల్వే ఫీడర్ రోడ్డులో ఉన్న శ్రీవారి ఆలయంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
● ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పెన్నోహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామి వారికి పట్టు వస్త్రాలు, గజమాల సమర్పించి అభిషేకం నిర్వహించడంతో పాటు పూజలు చేశారు. విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా దుశ్చర్యలకు పాల్పడిన వారికి రానున్న రోజుల్లో ప్రజలే తప్పక బుద్ధి చెబుతారన్నారు.
● గుంతకల్లులోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి పూజలు చేశారు. 101 టెంకాయలు స్వామి వారికి సమర్పించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ భవాని, వైస్ చైర్‌పర్సన్ నైరుతి రెడ్డి పాల్గొన్నారు. గుత్తి శివాలయంలో పార్టీ కన్వీనర్లు పీరా, గోవర్ధన్ రెడ్డి పూజలు నిర్వహించారు.
● కళ్యాణదుర్గంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సూపర్‌సిక్స్ హామీల అమలుపై స్పష్టత ఇవ్వకుండా నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
● శింగనమల మండలం నాయనవారిపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వీరాంజనేయులు, డీసీఎంఎస్ మాజీ డైరెక్టర్ బొమ్మన శ్రీరామిరెడ్డి పూజలు నిర్వహించారు. వీరాంజనేయులు మాట్లాడుతూ చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయాలంటూ పూజలు నిర్వహించామన్నారు.
● రాయదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో రాయ దుర్గంలోని ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలను దేవుడు క్షమించడన్నారు. కుట్రపూరితంగానే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ పొరాళ్ల శిల్ప, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
● రాప్తాడు, తాడిపత్రి నియోజకవర్గాల్లోనూ నాయకులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్ద సంఖ్యలో పాల్గొన్న
నాయకులు, కార్యకర్తలు
కూటమి ప్రభుత్వ దుశ్చర్యలపై నేతల మండిపాటు
రాజకీయాలకు శ్రీవారిని
వాడుకోవడం దురదృష్టకరం:
పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురంలో శ్రీవారికి పూజల అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూ విశిష్టతకు, తిరుమల పవిత్రతకు కూటమి నేతలు భంగం కలిగించారన్నారు. చంద్రబాబు పాపాన్ని ప్రక్షాళన చేయడంతో పాటు స్వామి వారి ఆగ్రహం రాష్ట్ర ప్రజలపై పడకూడదని ప్రార్థించామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్య తలు తీసుకున్నాక అన్ని వ్యవస్థలనూ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. వంద రోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపారన్నారు. తమ పార్టీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లకుండా అడ్డంకులు సృష్టించడం దుర్మార్గమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment