వ్యక్తి బలవన్మరణం
బుక్కరాయసముద్రం: మండలంలోని రెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగేంద్ర (40) ఆత్మహత్య చేసుకున్నాడు. గొర్రెల పోషణతో కుటుంబాన్ని పోషించుకుంటున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తెకు మతిస్థిమితం లేదు. కుటుంబపోషణ, గొర్రెల కొనుగోలుకు చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు లోనైన ఆయన గ్రామ శివారులోని చెట్టుకు బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
ఉద్యోగం రాలేదంటూ యువతి ఆత్మహత్య
బెళుగుప్ప: ఉన్నత చదువులు అభ్యసించినా ఉద్యోగం రాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బెళుగుప్ప మండలం జీడిపల్లి గ్రామానికి చెందిన కమ్మ రామాంజనేయులు, నాగమణి దంపతుల కుమార్తె నవ్య (22) అనంతపురంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో డిగ్రీ వరకూ చదువుకుంది. అనంతరం హైదరాబాద్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరి సాఫ్ట్‌వేర్ కోర్సు పూర్తి చేసింది. ఈ క్రమంలో ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయినా ఫలితం దక్కలేదు. దీంతో ఇంటికి చేరుకున్న ఆమె బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment