రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం
● రైతు సంఘం నాయకుల ధ్వజం
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు ధ్వజమెత్తారు. జిల్లాలోని 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలంటూ బుధవారం స్థానిక టవర్‌క్లాక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల జిల్లా కార్యదర్శులు ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.కృష్ణమూర్తి, ఎం.బాలరంగయ్య మాట్లాడారు. ఖరీఫ్‌లో వర్షాలు రాక జిల్లాలో 3 లక్షల ఎకరాలు బీడుగా మారాయన్నారు. వేరుశనగ, పత్తి, కంది, ఆముదం, తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. అయితే ప్రభుత్వం మొత్తం ఖరీఫ్ సగటు వర్షపాతం ఆధారంగా ఏడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి మిగిలిన మండలాల రైతులకు ద్రోహం చేస్తోందని మండిపడ్డారు. కరువు జిల్లాగా ప్రకటించి, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే 2023 ఖరీఫ్, రబీ పంటల బీమా, నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం అనుబంధ సంఘాల నాయకులు నాగేంద్రకుమార్, తరిమెల నాగరాజు. శివారెడ్డి, నల్లప్ప, వెంకట కొండ, రమేష్, నాగమ్మ, చిదంబరమ్మ, సువర్ణమ్మ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
అప్రెంటిషిప్‌కు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్/క్రైం: ఆర్టీసీలో అప్రెంటిషిప్ చేసేందుకు ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపాల్ రామమూర్తి, ఆర్టీసీ జోనల్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నజీర్‌అహ్మద్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన అభ్యర్థులు అర్హులు. నవంబర్ 5 నుంచి 19వ తేదీలోపు www.apprenti ceshipindia.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 88868 85173లో సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment