●శేషజీవితం ఆనందంగా గడపండి
ఉద్యోగ విరమణ పొందిన వారితో
కలెక్టర్ వినోద్‌కుమార్, డీఆర్వో మలోల
అనంతపురం అర్బన్: ఉద్యోగ విరమణ చేసిన మీరంతా శేష జీవితాన్ని ఆనందంగా గడపండి అంటూ కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఈ నెలలో ఉద్యోగ విరమణ చేసిన వారికి జిల్లా యంత్రాంగం తరఫున బుధవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఉద్యోగ విరమణ చేసి వారిని కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో మలోల, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి రమ, మెజిస్టీరియల్ విభాగం సూపరింటెండెంట్ వసంత లత, భూసంస్కరణ విభాగం సూరింటెండెంట్ నారాయణస్వామి, ఉద్యోగ విరమణ చేసిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment