హైకోర్టు జడ్జికి స్వాగతం
అనంతపురం టవర్‌క్లాక్: హైకోర్టు జడ్జి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డికి ఘన స్వాగతం లభించింది. నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం జస్టిస్ శ్రీనివాసరెడ్డిని కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ మర్యాద పూర్వకంగా కలిశారు. మొక్కలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శ్యాంసుందర్, శ్రీసత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధరతో
పత్తి కొనుగోలు
అనంతపురం అగ్రికల్చర్: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)తో రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు మార్కెటింగ్‌శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) సి.రామాంజినేయులు, ఏడీఎం బి.సత్యనారాయణచౌదరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుత్తి, తాడిపత్రి మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పొట్టిరకం పత్తి క్వింటా రూ.7,121, పొడవు రకం క్వింటా రూ.7,521 మద్దతు ధర ప్రకటించామన్నారు. ఇంతకన్నా తక్కువ ధరకు బహిరంగ మార్కెట్‌లో అమ్ముకోకుండా కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలన్నారు. పండించిన పత్తిని బాగా అరబెట్టి 8 శాతం కన్నా ఎక్కువగా తేమ ఉండేలా, దుమ్ము, ధూళి లేకుండా బాగా శుభ్రపరిచిన పత్తిని తీసుకురావాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలన్నారు. రైతులు తమ ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్సులను రైతు సేవా కేంద్రాల అసిస్టెంట్లకు అందించి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment