రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇలాకా అయిన
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ చిన్నారులకు వేసే వ్యాధినిరోధక టీకాలు సమయానికి అందడం లేదు. పుట్టిన వెంటనే వేయాల్సిన కొన్ని రకాల వ్యాక్సిన్‌లు లేకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బు చెల్లించి వేయించుకునే పరిస్థితి నెలకొంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధిగా ఉండాల్సిన ముఖ్యమైన టీకాలు స్టాకు లేవని చెబుతున్నారు. దీంతో వ్యయప్రయాసలకోర్చి తమ చిన్నారిని వ్యాక్సిన్‌కు తీసుకెళ్లే బాలింతలు నిరాశతో వెనుదిరిగి వస్తున్నారు. నిర్ణయించిన మేరకు వారానికి రెండు రోజుల పాటు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, హెల్త్‌క్లినిక్‌లలో వ్యాక్సిన్ ఉండాలి. కానీ అందుబాటులో ఉండడం లేదు. కొన్ని చోట్ల వ్యాక్సిన్‌కు వెళ్లిన బాలింతలకు ఇప్పుడే వేయకపోయినా ఫరవాలేదు, ఇంకో రెండు వారాలు ఆగి రండి అంటూ ఆరోగ్య సిబ్బంది చెప్పి పంపుతున్నారు.
హెపటైటిస్–బి 24 గంటల్లో ఇవ్వాల్సి ఉన్నా...
శిశువు పుట్టిన ఇరవై నాలుగు గంటల్లోనే కామెర్ల వ్యాధి రాకుండా హెపటైటిస్– బి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ వ్యాక్సిన్ ప్రధాన ఆస్పత్రుల్లోనే లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వేయించుకోవాలంటే భారీగా డబ్బు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాకు ఇంకా రాలేదని చెబుతుండటంతో ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొనుక్కుని తెచ్చి తమ బిడ్డలకు వేయించుకుంటున్నారు. మీజిల్స్ రూబెల్లా (తట్టు రాకుండా) వేసే వ్యాక్సిన్ కూడా కనిపించడం లేదు. అత్యంత ప్రమాదకరమైన కోరింత దగ్గుకు ఇచ్చే డీపీటీ వ్యాక్సిన్ కొన్ని చోట్ల లేదు. విజయవాడ నుంచి ఇంతవరకూ సరఫరా కాలేదని వైద్యులు చెబుతున్నారు.
● వ్యాధినిరోధక టీకాల్లో పెంటావాలెంట్ వ్యాక్సిన్ అత్యంత కీలకమైనది. అత్యంత ప్రమాదకరమైన డిఫ్తీరియా (కోరింత దగ్గు), టెటనస్, హెపటైటిస్– బి వంటి వ్యాధులు రాకుండా రక్షణనిస్తుంది. ఒక విధంగా వ్యాధినిరోధక టీకాల్లో ఇది సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది. అలాంటి వ్యాక్సిన్ ఇప్పుడు అన్ని చోట్లా పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు. ఇది బిడ్డ పుట్టిన 6 వారాల్లోగా వేయాలి. తిరిగి ఏడాదిలోపు మళ్లీ ఒకసారి వేయాలి. అత్యంత సమర్థవంతంగా పనిచేసే ఈ వ్యాక్సిన్ ఇప్పుడు అరకొరగా ఉండటం ఇబ్బందిగా ఉంది.
ఉమ్మడి జిల్లాలో అందుబాటులో లేని వ్యాక్సిన్‌లు
పెంటావాలెంట్ వ్యాక్సిన్ లేక బాలింతల ఆందోళన
వేలాదిమంది చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
హెపటైటిస్ బి, మీజిల్స్ వ్యాక్సిన్‌లూ కొన్నిచోట్ల కొరత
విధిలేక ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనుక్కుంటున్న సామాన్యులు
Comments
Please login to add a commentAdd a comment