హాస్టల్.. హడల్
జిల్లా అంతటా సోమవారం పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఈశాన్యం దిశగా గంటకు 6 నుంచి
8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
మంగళవారం శ్రీ 19 శ్రీ నవంబర్ శ్రీ 2024
అడుగు బయట పెట్టలేం
వసతి గృహం ప్రాంగణంలో విషపురుగుల సంచారం ఎక్కువగా ఉంటోంది. రాత్రివేళ అడుగు బయట పెట్టాలంటే విషపురుగుల భయం వెంటాడుతోంది. అలాగే, హాస్టల్‌లోని మరుగుదొడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మలవిసర్జనకు ఆరుబయట ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
– నితిన్, 7వ తరగతి విద్యార్థి, పామిడి
రాత్రి పూట దోమల బెడద
హాస్టల్‌లో డోర్‌లు సరిగ్గా పడటం లేదు. రాత్రిళ్లు దోమలు విపరీతంగా కుడుతున్నాయి. సరిగా చదువు కోలేకపోతున్నాం. మరుగు దొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. రోజూ ఆరుబయటే స్నానాలు చేస్తున్నాం. దుప్పట్లు కూడా ఇవ్వలేదు. ఇంటి నుంచే తెచ్చుకున్నాం. తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. –భాస్కర్, 8వ తరగతి, బొమ్మనహాళ్
సమస్యలు పరిష్కరించాలి
హాస్టల్‌లో మరుగుదొడ్లు సరిగా లేవు. కిటికీలకు మెష్ లేదు. ఆరు బయట స్నానాలు చేయాల్సిన పరిస్థితి. దీంతో మురుగునీరు సమీపంలోనే చేరి దుర్గంధం వస్తోంది. వీటన్నింటి నడుమ చదువు సాగించడం కష్టంగా ఉంటోంది. వసతి గృహాల్లోని పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సమస్యలను పరిష్కరిస్తే బాగుంటుంది.
– రవితేజ, 10 వ తరగతి,
పెద్దవడుగూరు ఎస్సీ హాస్టల్
ఒకే గదిలో తరగతి గది, వసతి గృహం నిర్వహిస్తున్న దృశ్యమిది. కళ్యాణదుర్గం మారెంపల్లి కాలనీలో ఉన్న ఎస్టీ బాలుర వసతి గృహంలో ఈ దుస్థితి నెలకొంది. పాఠశాలలో మొత్తం 250 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా వసతి గదులు, తరగతి గదులు లేక ఆరుబయట, వరండాలలో చదువుకుంటున్నారు. ఒక్కోగదిలో 20 మంది వరకు ఉంటున్నారు. సుమారు 20 మందికి కలిపి ఒకే మరుగుదొడ్డి ఉంది. దీన్ని బట్టి హాస్టల్‌లో విద్యార్థుల అవస్థలు అర్థం చేసుకోవచ్చు.
అనంతపురం రూరల్: పేద విద్యార్థులను కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ‘వారికేమైతే మాకేం’ అన్నట్లు వ్యవహరిస్తోంది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలు తాండవిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తోంది. చాలా వసతి గృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. ఉడకని అన్నం, నీళ్ల సాంబారుతోనే సరిపెడుతున్నారు. కనీసం తాగడానికి నీరు ఉండటం లేదు. సరిపడా గదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటికి సైతం కష్టాలు తప్పడం లేదు. మినరల్ వాటర్ బదులు బోర్ల నీటిని వాడుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటు న్నాయి. దీంతో పిల్లలు జ్వరాల బారిన పడుతున్నారు. బాలికల హాస్టళ్ల పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. చాలా హాస్టళ్లకు ప్రహరీ కూడా లేకపోవడంతో బాలికల భద్రత గగనంలా తయారైంది.
గతంలో ఎప్పటికప్పుడు
సమస్యల పరిష్కారం
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యకు పెద్దపీట వేశారు. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడానికి హాస్టళ్ల మెనూలో మార్పులు తీసుకొచ్చారు. డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచి ఠంచనుగా అందించారు. ప్రభుత్వ పాఠశాలల తరహాలోనే వసతి గృహాల్లో సైతం నాడు– నేడు పనులకు శ్రీకారం చుట్టారు. క్రమం తప్పకుండా జిల్లా, మండల స్థాయి అధికారుల బృందం వసతి గృహాల్లో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు చేపట్టారు.
నేడు అధ్వానం..
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్యార్థులు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. గత ప్రభుత్వంలో మాదిరి అధికారుల బృందాలు వసతి గృహాల్లో తనిఖీలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. హాస్టళ్లలో లోటుపాట్లను గుర్తించి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాల్సిన సంక్షేమ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా వార్డెన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని చోట్ల సంక్షేమశాఖ అధికారులు, వార్డెన్లు కుమ్మక్కు కావడంతో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థుల కడుపులు మాడ్చుతున్నారు. వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులపై న్యాయస్థానాలు సైతం ప్రశ్నిస్తున్నా ప్రభుత్వంలో మాత్రం మార్పు రావడం లేదు.
విద్యార్థుల సతమతం..
వసతి గృహాల్లో సమస్యల నడుమ విద్యార్థులు మానసికంగా చితికిపోతున్నారు. అనంతపురం బీసీ సంక్షేమశాఖ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న బీసీ బాలుర జూనియర్ కళాశాల హాస్టల్‌లో తేజా అనే విద్యార్థి ఇటీవల ఉరేసుకున్నాడు. మౌలిక వసతులు లేని వసతి గృహాంలో సర్దుకుపోలేక, అదే క్రమంలో ఇంటికి వెళ్లలేక మానసిక క్షోభకు గురై హాస్టల్ బాత్‌రూమ్‌లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా నగరంలోని బీసీ బాలికల జూనియర్ కళాశాల వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్న ఓ బాలిక రెండు నెలల క్రితం బయటికి వెళ్లి ఆత్మకూరు మండలం వడ్డిపల్లి సమీపంలో హత్యకు గురైంది. వసతి గృహాల్లో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల తిష్ట
మెనూ అమలులో తీవ్ర నిరక్ష్యం
విద్యార్థులకు తప్పని ఇబ్బందులు
పేద పిల్లలపై కూటమి సర్కారు చిన్నచూపు
Comments
Please login to add a commentAdd a comment