రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం
అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం పక్కనపెట్టి రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు విపరీతంగా పెడుతున్నారన్నారు. ఆ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోకపోతే ప్రైవేట్ కేసులు వేయడానికి కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లీగల్‌సెల్ సభ్యులతో కలిసి ఆయన శుక్రవారం అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నారా లోకేష్, వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడుకు చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాల నుంచి పెట్టిన పోస్టులను సీఐ శ్రీకాంత్ యాదవ్‌కు వివరించారు. ఈ ట్వీట్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం మీడియాతో అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ను ఉద్దేశించి పెట్టిన పోస్టింగ్‌లు తమ మనోభావాలు గాయపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న నారా లోకేష్, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. నారా లోకేష్ ఆఫీస్‌లోనే ఈ పోస్టింగులకు రూపుకల్పన చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో మార్ఫింగ్ చేసిన పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారన్నారు. చట్టం అందరికీ సమానంగా అమలయ్యేలా చూడాలని కోరారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై అవమానకర రీతిలో పెడుతున్న పోస్టులను వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేసి, దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు, సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను కించపరిచేలా ఐటీడీపీ సోషల్ మీడియా ఖాతా నుంచి అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్నా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.
ఐటీడీపీపై చర్యలేవీ?
ఐటీడీపీ పేరుతో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అనంతపురం, వైఎస్సార్ రీజనల్ కోఆర్డినేటర్ లింగాల లోకేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు జి.ఉమాపతి మండిపడ్డారు. పోస్టులేవీ పెట్టకపోయినా వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. జగన్‌పై పెట్టిన అసభ్యకర పోస్టింగ్స్‌పై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కేసు నమోదు చేయని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వాసంతి సాహిత్య, అహుడా మాజీ చైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాకే చంద్రశేఖర్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాభేగ్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ కాగజ్‌ఘర్ రిజ్వాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, నాయకులు పెన్నోబులేసు, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, గౌస్ బేగ్, ఏకేఎస్ ఫయాజ్, మారుతినాయుడు, సుఖేష్, విద్యార్థి నాయకులు కై లాష్, విజయ్ రెడ్డి, కో–ఆప్షన్ మెంబర్ ఉమామహేశ్వరి, కార్పొరేటర్లు దేవి, సుమతి, కమల్ భూషణ్, శేఖర్‌బాబు, టీవీ చంద్రమోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, మునిశేఖర్, హసీనా, నరసింహులు, రహంతుల్లా, వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్ నాయకులు జూటూరు సుధాకర్ రెడ్డి, వెంకట్రాముడు, శ్రీనివాస్‌రెడ్డి, రామకిషోర్ రెడ్డి, గౌని నాగన్న, తలారి రేవతి, నరసింహారెడ్డి, బాకే హబీబుల్లా పాల్గొన్నారు.
వైఎస్ జగన్‌పై అసభ్యకర పోస్టింగులు
లోకేష్, అనిత, అయ్యన్న, అచ్చెన్నపై కేసు నమోదు చేయాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment