దేశ సేవలోఎన్‌సీసీ ప్రముఖ పాత్ర
అనంతపురం: దేశభక్తి గల పౌరులను తీర్చిదిద్దడంలో నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్ (ఎన్‌సీసీ) ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఎన్‌సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ కులకర్ణి అన్నారు. జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాల ఆడిటోరియంలో ఆదివారం ఎన్‌సీసీ 76వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కెప్టెన్ డాక్టర్ శారద, శ్రీ చైతన్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ గొల్లా పిన్ని సీతారామశాస్త్రి (రిటైర్డ్ ఇంగ్లిష్ లెక్చరర్) ముఖ్య అతిథిగా హాజరై ఎన్‌సీసీ ఏర్పాటు లక్ష్యాలు, సాధించిన అంశాలపై ప్రసంగించారు. సుబేదార్ మేజర్ బల్బీర్ సింగ్ పాల్గొన్నారు.
ప్రతి ఇంటికీ
మరుగుదొడ్డి తప్పనిసరి
ఆత్మకూరు: ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి అని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు తెలిపారు. మరుగదొడ్లు లేని ఇళ్లను గుర్తించేందుకు సర్వే జరుగుతోందన్నారు. శనివారం ప్రపంచ టాయిలెట్ దినోత్సవ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులో ఆయన మండల అధికారులతో కలసి పర్యటించారు. ఈ నెల 19 నుంచి డిసెంబర్ 10 వరకు ఈ ప్రచార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ మరుగుదొడ్డి కట్టుకోవడం, వాటి వాడకం, వినియోగం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని వారిని సర్వే చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు లేని వారి నుంచి దరఖాస్తులు తీసుకుని వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించరాదని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ లక్ష్మినరసింహ, సర్పంచ్ వరలక్ష్మి, తహసీల్దార్ లక్ష్మీనాయక్, ఆర్‌డబ్ల్యూస్ ఏఈ శివకుమార్, ఈవోఆర్‌డీ కామాక్షి , పంచాయతీ సెక్రెటరీ చంద్రశేఖర్, నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment