పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

Published Fri, Nov 29 2024 1:57 AM | Last Updated on Fri, Nov 29 2024 1:57 AM

పీజీ

పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి శుక్రవారం, శనివారం రెండు రోజుల పాటు స్పాట్‌ అడ్మిషన్లు చేపడుతున్నట్లు ప్రిన్సిపాల్‌ పద్మశ్రీ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీపీజీసెట్‌– 2024లో ఉత్తీర్ణులు కాకపోయినా, పరీక్ష రాయకపోయినా కేవలం డిగ్రీ ఉత్తీర్ణత ద్వారా ఎంఏ ఇంగ్లిష్‌, ఎంఏ ఎకనామిక్స్‌, ఎమ్మెస్సీ బాటనీ, ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌, ఎమ్మెస్సీ జువాలజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చని తెలియజేశారు. స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా ప్రవేశాలు పొందే విద్యార్థులు మొత్తం కోర్సు ఫీజు, అడ్మిషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉటుందని, వీరికి ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ రాదని స్పష్టం చేశారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో ఆయా డిపార్ట్‌మెంట్ల లో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ కోరారు.

48 మంది

ఎంపీఈఓలకు పోస్టింగ్‌

అనంతపురం అగ్రికల్చర్‌: డిప్యుటేషన్లు రద్దు కావడంతో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలో మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్స్‌ (ఎంపీఈవో)గా పనిచేస్తూ జిల్లాకు వచ్చిన 48 మందికి పోస్టింగ్‌ ఇచ్చినట్లు వ్యవసాయశాఖ అధికారులు గురువారం తెలిపారు. పంటల విస్తీర్ణం అధికంగా ఉన్న ప్రాంతాలు, ఆర్‌ఎస్‌కేలు అందుబాటులో లేని కొన్ని ప్రాంతాల్లో పనిచేసేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్ల రేషనలైజేషన్‌ మొదలయ్యాక పూర్తి స్థాయిలో బదిలీలు ఉంటాయని తెలిపారు.

8న ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష

అనంతపురం ఎడ్యుకేషన్‌: నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్ష డిసెంబరు 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్లు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్‌ఎంలు స్కూల్‌ యూడైస్‌ కోడ్‌ ద్వారా లాగిన్‌ అయి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకుని విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రభుత్వ పరీక్షల విభాగం, డీఈఓ కార్యాలయం (పాతది), కమలానగర్‌లో సంప్రదించాలని తెలిపారు.

రోడ్డు నిబంధనల

ఉల్లంఘనులపై కొరడా

అనంతపురం సెంట్రల్‌: రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు గురువారం కూడా జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. 24 గంటల వ్యవధిలో 2,546 కేసులు నమోదు చేసి రూ. 5.31 లక్షల జరిమానా విధించారు. అలాగే 93 బహిరంగ మద్యపానం కేసులు, 14 డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. ఏటీఎంల భద్రతలో భాగంగా 165 కేంద్రాలను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలపై డయల్‌ 100 లేదా 112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

గంజాయి విక్రయిస్తే

పీడీ యాక్ట్‌

అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న వారిపై పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ సిబ్బందిని ఆ శాఖ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య ఆదేశించారు. గురువారం అనంతపురంలోని ఎకై ్సజ్‌ పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. గంజాయి సరఫరా, విక్రయాలపై నిఘా మరింత పెంచాలన్నారు. జిల్లాలో ఎక్కడా కర్ణాటక మద్యం సరఫరా కాకూడదన్నారు. మద్యం షాపులు, బార్లలో తరచూ తనిఖీలు చేపట్టాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు జయ నరసింహ, జాకీర్‌, కృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
పీజీ కోర్సులకు  స్పాట్‌ అడ్మిషన్లు 1
1/2

పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

పీజీ కోర్సులకు  స్పాట్‌ అడ్మిషన్లు 2
2/2

పీజీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement