ఫూలే ఆశయాలకు ‘కూటమి’ తూట్లు
అనంతపురం కార్పొరేషన్: మహాత్మ జ్యోతిరావు ఫూలే ఆశయాలకు తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ప్రజలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ బడుగు, బలహన వర్గాలకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తున్నారని మండిపడ్డారు. మహాత్మా జ్యోతిరావ్ ఫూలే వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆ మహనీయుని చిత్రపటానికి పార్టీ శ్రేణులతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యతోనే సమ సమాజ స్థాపన ఏర్పాటవుతుందని నమ్మిన జ్యోతిరావు ఫూలే ఆశయాల మేరకు అన్ని వర్గాల వారికి నాణ్యమైన విద్యనందించేలా అప్పటి ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయని గుర్తు చేశారు. ఫూలే ఆశయాలకు అనుగుణంగానే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేశారన్నారు. కార్పొరేట్‌ను తలదన్నేలా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చడమే కాక... అదే స్థాయిలో నాణ్యమైన విద్యనూ చేరువ చేశారన్నారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలను కాలరాస్తోందన్నారు. గతేడాది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన తదితరాలకు సంబంధించి రూ.2,200 కోట్లు విడుదల చేసే సమయంలో కూటమి పార్టీలు కోర్టు కెళ్లి అడ్డుకున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు కావస్తున్నా నేటికీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదన్నారు. ఉద్యోగావకాశాలు, నిరుద్యోగ భృతి తదితర హామీలను సీఎం చంద్రబాబు విస్మరించారన్నారు. వ్యవస్థల వినాశనానికి కారణమైన కూటమి సర్కార్‌కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి రమేష్‌గౌడ్, జేసీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ వెన్నం శివరామిరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి, సైఫుల్లాబేగ్, ఎగ్గుల శ్రీనివాసులు, శ్రీదేవి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, నగరాధ్యక్షురాలు కృష్ణవేణి, కార్పొరేటర్లు ఇషాక్, కమల్‌భూషణ్, శ్రీనివాసులు, నరసింహులు, అబూసలేహ, నాయకులు మీసాల రంగన్న, అశ్వత్థనాయక్, పామిడి వీరా, పెన్నోబులేసు, చామలూరు రాజగోపాల్, రాధాకృష్ణ, అమర్‌నాథ్‌రెడ్డి, రియాజ్, నరసింహగౌడ్, ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, జావేద్, థామస్, రాధాకృష్ణ, రామచంద్ర, రామయ్య, తానీషా, హరిత, భారతి, శోభారాణి, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు అనంత
Comments
Please login to add a commentAdd a comment