జిల్లా అంతటా గురువారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. చలి తీవ్రత ప
రేపు నేమకల్లుకు సీఎం
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు గ్రామంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు జిందాల్ విజయనగర ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12.45 గంటలకు నేమకల్లుకు సీఎం చేరుకుంటారు. ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను లబ్ధిదారులకు పంపణీ చేస్తారు. అనంతరం నేమకల్లు ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని, గ్రామ ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. 3.45 గంటలకు హెలికాప్టర్‌లో నేమకల్లు నుంచి జిందాల్ విజయనగర్ ఎయిర్‌పోర్టుకు, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలు దేరి వెళతారని అధికార వర్గాలు తెలిపాయి.
విజయవంతం చేద్దాం
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేద్దామని కలెక్టర్ వినోద్‌కుమార్, ఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. గురువారం నేమకల్లులో వారు పర్యటించారు. హెలిప్యాడ్, సీఎం పంపిణీ చేయనున్న పెన్షన్ లబ్ధిదారుల గృహాలు, నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయం, గ్రామ సభ నిర్వహించే ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ప్రజల రాకపోకలకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సజావుగా గ్రామ సభ సాగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, డీఎస్పీ రవిబాబు, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్, సర్వే ఏడీ రూప్ల నాయక్, అనంతపురం మున్సిపల్ కమిషనర్ నాగరాజ, డీఐపీఆర్‌ఓ గురుస్వామి శెట్టి, బొమ్మనహాళ్ తహసీల్దార్ మునివేలు, ఎంపీడీఓ దాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment