ప్రభుత్వం కళ్లు తెరవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం కళ్లు తెరవాలి

Published Sun, Nov 24 2024 6:30 PM | Last Updated on Sun, Nov 24 2024 6:30 PM

ప్రభుత్వం కళ్లు తెరవాలి

ప్రభుత్వం కళ్లు తెరవాలి

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వంలో పనులు లేక గ్రామాలు విడిచి వలస వెళ్లే దయనీయమైన పరిస్థితి ఏర్పడిందని, ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరచి పేద ప్రజలకు పనులు కల్పించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం గార్లదిన్నె వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మార్చురీ వద్ద ఆయన పరామర్శించారు. మృతదేహాలకు నివాళులర్పించారు. సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్‌, వైద్యులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ పల్లెల్లో పనులు లేక ప్రజలు ఇతర ప్రాంతాలకు పరుగులు తీయాల్సి వస్తోందన్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కూలీలు పనుల కోసం 50 నుంచి వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. అలా వెళ్లిన ఎనిమిది మంది మృత్యువాత పడడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులు, గాయపడ్డవారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement