నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలి
● కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి
బుక్కరాయసముద్రం: నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డెరెక్టర్ ఆఫ్ సెంట్రల్ నోడల్ ఆఫీసర్ అరులానందన్ పేర్కొన్నారు. గురువారం రెడ్డిపల్లి కేవీకేను జలశక్తి అభియాన్ జిల్లా వాటర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ సెంట్రల్ టీం సందర్శించింది. జిల్లాలో నీటి వనరుల వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరులానందన్ మాట్లాడుతూ... ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకోవాలని రైతులకు సూచించారు. ఉపాధి హామీ పథఽకం కింద చెక్‌డ్యాం, ఫారం ఫండ్‌లలో పూడిక తీతలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, శాస్త్రవేత్తలు డాక్టర్ టి.మాధవి, సుధారాణి, కిషోర్, డాక్టర్ కె.మాధవి, డాక్టర్ శశికళ, డీఎల్‌డీఓ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు అనూరాధ, శైలజా, ఎన్‌ఆర్‌ఈజీఎస్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
బిల్ కలెక్టర్ అవినీతిపై
కలెక్టర్‌కు లేఖ
గుత్తి రూరల్: స్థానిక మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్ అవినీతిపై కలెక్టర్‌కు విశ్రాంత తహసీల్దార్ అనిల్‌కుమార్ రాసిన లేఖ విచారణ నిమిత్తం గురువారం గుత్తి తహసీల్దార్ కార్యాలయానికి చేరింది. లేఖలోని సారాంశం ఇలా... ‘2019 నుంచి ఐదేళ్లుగా గుత్తి మున్సిపాలిటీలో బిల్‌కలెక్టర్‌గా పనిచేసిన చంద్రశేఖర్ ఇటీవల గుంతకల్లు మున్సిపాలిటీకి బదిలీ అయ్యాడు. ఆయన ఎక్కడ పనిచేసినా సెలవు పెట్టి పైరవీలతో తిరిగి గుత్తి మున్సిపాలిటీకే బదిలీ చేయించుకుని వస్తాడు. అయితే ఆయన పనిచేసే చోట ఎక్కడ ప్రభుత్వ స్థలాలు ఉన్నా... వాటిని వెంటనే బంధువులు, కుమారుల పేరుపై దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమిస్తాడు. ఇలాగే గుత్తి పట్టణంలోని బీసీ కాలనీ సర్వే నంబర్ 411లో దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్న స్థలంలో నాలుగు భవంతులు నిర్మించాడు’. కాగా, ప్రస్తుతం గుత్తి తహసీల్దార్‌గా ఉన్న ఓబులేసు.... పేరుకే తహసీల్దార్ అని, అయితే ఎలాంటి అవినీతి, అక్రమాలు జరిగినా ఆయన స్పందించడం లేదని లేఖలో పేర్కొనడం గమనార్హం. గుత్తి మున్సిపాలిటీతో పాటు రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై విశ్రాంత తహసీల్దార్ రాసిన లేఖ ప్రస్తుతం గుత్తిలో కలకలం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment