ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ
బెళుగుప్ప: కుటుంబ కలహాల నేపథ్యంలో విసుగు చెంది తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఓ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపి పురుగుల మందు తాగిన ఘటన కలకలం రేపింది. వివరాలు.. బెళుగుప్ప మండలం దుద్దేకుంట గ్రామానికి ఎర్రిస్వామి రెండో కుమారుడు అనిల్ (25)కు ఏడాది క్రితం విడపనకల్లు మండలం హవలిగి ఆమ్రానికి చెందిన గీతాంజలితో వివాహమైంది. ఈ క్రమంలో కుటుంబంలో కలహాలు చోటు చేసుకోవడంతో విసుగు చెందిన అనిల్ బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం సెల్ఫీ బీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశాడు. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపి పురుగుల మందు తాగాడు. తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సోదరుడు రామును వీడియోలో కోరాడు. అనంతరం సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. దీంతో అనిల్ కుటుంబీకులు విషయాన్ని బెళుగుప్ప ఎస్‌ఐ శివ దృష్టికి తీసుకెళ్లడంతో పోలీసుల విస్తృత గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment