ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా
● నేటి నుంచి సీపీఎం 14వ
జిల్లా మహాసభలు
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కారమే అజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేలా సోమ, మంగళవారం రెండు రోజుల పాటు సీపీఎం 14వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ తెలిపారు. ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి లలితకళాపరిత్ వరకూ ప్రదర్శన ఉంటుందన్నారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు వెంకటేశ్వరరావు, ప్రభాకర్‌రెడ్డి పాల్గొంటారన్నారు. 2021లో జరిగిన 13వ జిల్లా మహాసభల్లో తీసుకున్న కర్తవ్యాల అమలు తీరును సమీక్షించుకుంటామన్నారు. రాబోవు మూడేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారానికి చేపట్టే ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామన్నారు. మహాసభల్లో నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమలో సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు బాలరంగయ్య, నగర కార్యదర్శి రామిరెడ్డి, కమిటీ సభ్యులు రామాంజినేయులు, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్నిక
అనంతపురం సెంట్రల్: పశు సంవర్ధక శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని సాయినగర్‌లో ఉన్న ఆస్పత్రిలో యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా వరప్రసాద్(మరూరు), కార్యదర్శిగా రంగనాయకమ్మ(శింగనమల), కోశాధికారిగా సాకే చంద్ర (శ్రీసత్యసాయి జిల్లా), వైస్ ప్రెసిడెంట్‌లుగా బాబునాయుడు(చియ్యేడు), ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీగా రామాంజనేయులు, ఈసీ సభ్యులుగా ఆదినారాయణ, వన్నప్ప, మల్లికార్జున, సద్గురు మూర్తి, రాజేశ్వరి తదితరులు ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment