మాకు సంబంధం లేదు
అనంతపురం ఎడ్యుకేషన్: డిగ్రీ ఫస్టియర్ మొదటి సెమిస్టర్ హిందీ పరీక్షలో రెగ్యులర్ విద్యార్థినికి సప్లిమెంటరీ ప్రశ్నపత్రం ఇచ్చిన నగరంలోని ఎస్‌ఎల్‌ఎన్ కళాశాల యాజమాన్యం... తాము చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా విద్యార్థినిదే తప్పు అంటూ వితండవాదం చేస్తోంది. ప్రశ్నపత్రం తారుమారు విషయంపై సదరు విద్యార్థిని ఫర్హానా అదేరోజు ఇన్విజిలేటర్‌ను అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. తర్వాత మరుసటి రోజు పరీక్ష కోసం వెళ్లిన సమయంలో ఓ రెక్వెస్ట్ లెటర్ రాసుకుంది. ఇన్విజిలేటర్ కారణంగా ప్రశ్నపత్రం వేరేది ఇచ్చారు. హిందీ పరీక్షలో నష్టం వాటిల్లకుండా తాను రాసిన ఎన్‌ఎస్1–131 జవాబుపత్రాన్ని పరిగణనలోకి తీసుకుని మూల్యాంకనం చేయాలంటూ ఎస్కేయూ వీసీకి లేఖ రాసింది. ఇందులో కౌంటర్‌గా పరీక్ష కేంద్రం ప్రిన్సిపాల్ సంతకం కోసం వెళ్తే కలవనీయకుండా మహిళా అధ్యాపకురాలు అడ్డుకున్నారు. ‘ఇలాంటివన్నీ మాకు సంబంధం లేదు, మీరే చూసుకోవాలి’ అంటూ ఉచిత సలహా ఇచ్చి పంపారు. తాను ప్రిన్సిపాల్‌ను కలవాలని అడిగితే.. ప్రిన్సిపాల్ కూడా ఈ విషయమే చెప్పారంటూ అధ్యాపకురాలు గట్టిగా చెప్పినట్లు విద్యార్థిని వాపోయింది. చివరకు విద్యార్థిని తండ్రి వెళ్లి ప్రిన్సిపాల్‌ను కలిస్తే వినకుండా గట్టిగా కేకలు వేసి బయటకు పంపారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు నష్టం జరగకుండా చూడాలని విద్యార్థిని ఫర్హానా విజ్ఞప్తి చేస్తోంది.
‘ప్రశ్నపత్రం తారుమారు’లో విద్యార్థినికి కాలేజీ యాజమాన్యం ఉచిత సలహా
జవాబుపత్రం మూల్యాంకనానికి స్వీకరించాలని ఎస్కేయూకు విద్యార్థిని లేఖ
సంతకం చేసేందుకు ప్రిన్సిపాల్ ససేమిరా
Comments
Please login to add a commentAdd a comment