హైకోర్టు జడ్జి సురేష్‌రెడ్డికి ఘన స్వాగతం
అనంతపురం టవర్‌క్లాక్: జిల్లాకు విచ్చేసిన హైకోర్టు జడ్జి సురేష్‌రెడ్డికి ఇన్‌చార్జి కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జడ్జి సురేష్‌రెడ్డిని కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం జిల్లా సమస్యలపై చర్చించారు.
విశా ఫెర్రర్‌కు
ఉమెన్ అచీవ్‌మెంట్ అవార్డు
అనంతపురం: ఆర్డీటీ మహిళా సాధికారిత డైరెక్టర్ విశా ఫెర్రర్‌ను ‘సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవ్‌మెంట్ అవార్డు–2024’ వరించింది. ఆర్డీటీ తరఫున మహిళా సాధికారితకు విశేషంగా కృషి చేసినందుకు గాను ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఆదివారం బెంగళూరులోని కేఈఏ ప్రభాత్ ఆడిటోరియంలో సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవ్‌మెంట్ అవార్డు (ఎస్‌ఐడబ్ల్యూఏఏ) సంస్థ సీఈఓ రాధ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
పటిష్ట స్థితిలో మహారాష్ట్ర జట్టు
● సెంచరీతో చెలరేగిన కిరణ్ చోర్మలే
అనంతపురం: బీసీసీఐ – ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా అనంతపురం ఆర్డీటీ స్పోర్ట్స్ విలేజీలో నిర్వహిస్తున్న కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 పోటీల్లో ఆదివారం ఆంధ్ర–మహారాష్ట్ర జట్లు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 284 పరుగులతో పటిష్ట స్థితికి చేరుకుంది. మహారాష్ట్ర బ్యాటర్ కిరణ్ చోర్మలే 209 బంతుల్లో (6 సిక్సర్లు, 19 ఫోర్లు) 162 పరుగులతో చెలరేగాడు. శుస్రుత్ సావంత్ 6 ఫోర్లతో 59 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఆంధ్ర జట్టు బౌలర్ యువన్ 7 ఓవర్లలో 4 మేడిన్ ఓవర్లు వేసి, 4 పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు కీలకమైన వికెట్లను తీశాడు. పి.ఆదిత్యరెడ్డి, బి.యశ్వంత్, ఎన్.రాజేష్ చెరొక వికెట్ పడగొట్టారు. బీసీసీఐ సెలెక్టర్ హర్వీందర్‌సింగ్ సోదీ, ఏసీఏ ఏజీఎం డి.శివకుమార్, ఏడీసీఏ ప్రెసిడెంట్ పీఎల్ ప్రకాష్‌రెడ్డి, ఏడీసీఏ సెక్రెటరీ వి.భీమలింగారెడ్డి, ఏసీఏ సౌత్ జోన్ అకాడమీ అడ్మిన్ మేనేజర్ పి.కె.సాగర్ చౌదరి, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ మిలింద్ గుంజాల్, ఏడీసీఏ కోశాధికారి షబ్బీర్ మ్యాచ్‌ను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment