నీరా‘జనం’.. జగన్నినాదం
రాప్తాడులో వైఎస్ జగన్‌తో కరచాలనం చేసేందుకు ఎగబడుతున్న అభిమానులు
సాక్షి బృందం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి శుక్రవారం జిల్లాలో అపూర్వ స్వాగతం దక్కింది. ముదిగుబ్బ, బత్తలపల్లి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, పెనుకొండ, సోమందేపల్లి, పాలసముద్రం క్రాస్, చిలమత్తూరులో అభిమానులు బాణసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు.
జాతీయ రహదారిపై అభిమాన సంద్రం
ముదిగుబ్బలోని కాకతీయ ధాబా వద్ద, బత్తలపల్లిలోని టోల్‌ప్లాజా వద్ద జగన్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. జై జగన్ నినాదాలు చేశారు. వైఎస్ జగన్ వారికి అభివాదం చేశారు.
అభిమాన హోరు
రాప్తాడులోని నాలుగు రోడ్ల కూడలికి జగన్ కాన్వాయ్ చేరుకోగానే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అహుడా మాజీ చైర్మన్ మహలక్ష్మీ శ్రీనివాస్‌తో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ‘జై జగన్...జైజై జగన్ అంటూ అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. జననేతతో మాట్లాడాటానికి, కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. చెన్నేకొత్తపల్లిలోని వై జంక్షన్ వద్ద, గోరంట్ల మండలం పాలసముద్రం క్రాస్‌లోనూ భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు జగన్‌కు ఘన స్వాగతం పలికారు.
స్వాగతం పలికిన ఉషశ్రీచరణ్
సోమందేపల్లి వై జంక్షన్ వద్ద వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, పార్టీ నేత పొగాకు రామచంద్ర తమ అభిమాన నేతకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఇక బాగేపల్లి టోల్‌ప్లాజా వద్ద కూడా జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. సమన్వయకర్త టీఎన్ దీపిక, వేణురెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఆయనతో కరచాలనం, సెల్ఫీ కోసం పోటీపడ్డారు. వారందరికీ అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం
జాతీయ రహదారిపైకి చేరిన గ్రామీణులు
జననేతతో కరచాలనం,
సెల్ఫీకోసం ఎగబడిన జనం
Comments
Please login to add a commentAdd a comment