అనంతపురం క్రైం: ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్‌ను ఈ నెల 31వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్‌నారాయణ్‌శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలోని 2,83,459 మంది పింఛన్‌దారులకు రూ.124.99 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ నెల 31 నుంచి జనవరి రెండో తేదీ వరకు పింఛన్‌ను పంపిణీ కొనసాగుతుందని వెల్లడించారు. లబ్ధిదారులు సచివాలయాలు, ఇతర ప్రైవేటు స్థలాలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సచివాలయం సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి మీ ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్ పంపిణీ చేస్తారని తెలిపారు. మొదటి రోజే వంద శాతం పింఛన్ పంపిణీ చేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment