అనంతపురం: కిరాణా కొట్టు నిర్వాహకులు తమ నుంచి అప్పులు తీసుకుని.. చెల్లించాలని అడిగితే ఐపీ నోటీసులు ఇచ్చాడని కళ్యాణదుర్గం మండలం బాల వెంకటరాపురం గ్రామానికి చెందిన బాధితులు శుక్రవారం ఎస్పీ జగదీష్‌కు వినతిపత్రం అందజేశారు. కిరాణా కొట్టు నిర్వహిస్తున్న వలి సోదరులు గ్రామంలో ఒకరికి తెలియకుండా ఒకరితో అలా 123 మంది నుంచి రూ.5 కోట్ల దాకా అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. అప్పులు తీర్చకుండా కాలయాపన చేస్తూ చివరకు ఎగ్గొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, బంగారు అంతా తీసేసుకున్న తర్వాత తమకు ఐపీ (ఇన్‌సాల్వెన్సీ పిటిషన్) నోటీసులు అందజేశారని విలపించారు. ఎన్నో కష్టాలుపడి, పైసాపైసా కూడబెట్టిన సొమ్మును నమ్మకంగా ఉన్నారని అప్పుగా ఇస్తే ఇలా చట్టంలో ఉన్న లొసుగులను చుట్టంగా మార్చుకుని తమను నట్టేట ముంచారని విలపించారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment