తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి
అనంతపురం: తాడిపత్రి ఏఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రోహిత్ కుమార్ చౌదరి ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్నారు. కాగా, తాడిపత్రికి 2014లో ట్రైనీ ఐపీఎస్‌ను డీఎస్పీగా పంపారు. తాజాగా పూర్తిస్థాయిలో ఏఎస్పీని కేటాయించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తాడిపత్రిలో అంతులేని విధంగా సాగుతున్న అరాచకాలను కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
సామాన్యుడిపై జులుం ప్రదర్శించడం అన్యాయం
● దాడి చేసిన పోలీసులపై
చర్యలు తీసుకోవాలి ●
● డీఎస్పీకి మేయర్ వసీం ఫిర్యాదు
అనంతపురం సెంట్రల్: అనంతపురంలో ఓ సామాన్యుడిపై జులుం ప్రదర్శించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మేయర్ వసీం డిమాండ్ చేశారు. ఆర్టీఓ కార్యాలయం సమీపంలో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇంతియాజ్ అహ్మద్‌పై దాడిని ఖండిస్తూ సోమవారం నగర డీఎస్పీ శ్రీనివాస్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అకారణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై ఓ కానిస్టేబుల్, హోంగార్డులు దాడికి పాల్పడిందే కాకుండా బాధితునిపై కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు. ఘటనకు సంబంధించి వీడియోలను డీఎస్పీకి చూపించారు. ఇటీవల కాలంలో పోలీసుల తీరు ఆక్షేపణీయంగా ఉందని, స్టేషన్‌లోనే అనుమానాస్పదంగా న్యాయవాది మృతి చెందడం, టవర్‌క్లాక్ వద్ద యువకుడిని బూటుకాళ్లతో తన్నిన ఘటనలు మరువకముందే బహిరంగంగా సామాన్యుడిని చితకబాదడం అన్యాయమన్నారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్, వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్ రిజ్వాన్, కార్పొరేటర్లు రహంతుల్లా, కమల్‌భూషన్, నాయకులు ఖాజా, దాదు, కాకర్ల శీనా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment