●అంగన్‌వాడీ సరుకుల్లో నాణ్యత డొల్ల ●కొన్ని కేంద్రాలకు అ
●రక్తహీనతతో గర్భిణుల సతమతం ●పుట్టిన పిల్లల్లోనూ అనారోగ్య సమస్యలు
● రాయదుర్గం ప్రాజెక్టు పరిధిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రంలో 3 సంవత్సరాల 4 నెలల
చిన్నారికి ఇటీవల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. 9.2 కేజీల బరువు, 85 సె.మీ ఎత్తు ఉన్నట్లు గుర్తించారు. వాస్తవంగా ఆ వయసు చిన్నారి 90–102 సెం.మీ ఎత్తు, 13–16 కేజీల బరువు ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క.
రాయదుర్గం: అంగన్‌వాడీ ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సరుకుల్లో నాణ్యత తీసికట్టుగా మారుతోంది. కొన్ని కేంద్రాలకు అరకొరగా సరుకులు సరఫరా చేస్తున్నారు. చాలా తక్కువ సైజుతో ఉండే కోడిగుడ్లు అందిస్తుండటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.కూటమి ప్రభుత్వ అలసత్వం కారణంగా గర్భిణులు రక్తహీనతతో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
హాట్‌టాపిక్ సీడీపీఓల అంశం..!
జిల్లాలోని కణేకల్లు, ఉరవకొండ, శింగనమల, అనంత పురం రూరల్, గుత్తి ప్రాజెక్టుల్లో విధులు నిర్వహిస్తున్న సీడీపీఓలు విజయవాడ రావాలంటూ రెండు రోజుల క్రితం ఐసీడీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి పిలుపు రావడం జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సరుకులు అందిస్తున్నా.. ఆయా ప్రాజెక్టుల పరిధిలో చాలామంది పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు, బరువుకు తగ్గ ఎత్తు లేకపోవడంతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందని, అందుకే ఈ విషయంపై వివరణ ఇచ్చేందుకు ఆయా సీడీపీఓలను పిలిచినట్లు తెలిసింది. అయితే, సరుకులే బాగా లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారనే విమర్శలు వినిపిస్తుండటం గమనార్హం.
గతంలో ప్రత్యేక దృష్టి..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతాశిశు సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. అంగన్‌వాడీల్లో సంస్కరణలు అమల్లోకి తీసుకొచ్చారు. నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందజేస్తూ తల్లీబిడ్డల సంక్షేమానికి పాటు పడ్డారు. ‘బాలామృతం’, ‘బాల సంజీవని’ కిట్ల ద్వారా నాణ్యమైన కోడిగుడ్లు, పాలు, కందిపప్పు, ఆయిల్, చిక్కీ, రాగిపిండి, ఎండు కర్జురం బియ్యం అందించి ఆదుకున్నారు.
తీవ్ర నిర్లక్ష్యం..
కూటమి ప్రభుత్వంలో మాతాశిశువులపై అంతు లేని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడం లేదు. దీంతో కిట్లను తల్లిదండ్రులు సరిగా తీసుకోవడం లేదు. ఈ క్రమంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. రక్తహీనత నివారించాలంటే చిన్నారులకు చిరుధాన్యాలతో చేసిన ఆహారం ఇవ్వడంతో పాటు బెల్లం, వేరుశనగ, నువ్వులతో తయారు చేసిన ఉండ్లు అందించాలి. పాల ఉత్పత్తులు, గుడ్లు, మాంసం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా గర్భిణులను ప్రోత్సహించాలి.
Comments
Please login to add a commentAdd a comment