ఘనంగా ‘డాకు మహారాజ్’ విజయోత్సవం
అనంతపురం: నగరంలో బుధవారం ‘డాకు మహారాజ్’ చిత్ర విజయోత్సవం ఘనంగా జరిగింది. నటీనటులను చూసి అభిమానులు, నగరవాసులు ఆనందం వ్యక్తం చేశారు. డాకు మహారాజ్ చిత్రం ఈ నెల 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనంతపురంలో చిత్ర విజయోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తాను దైవాన్ని నమ్ముతానన్నారు. తల్లిదండ్రులు, కళామతల్లి ఆశీర్వాదంతో వరుసగా నాలుగో విజయం సాధించానన్నారు. ప్రతి సినిమాను ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తానన్నారు. ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
సందడి చేసిన సినీ తారలు..
డాకు మహారాజ్ చిత్రంలో నటించిన నటీనటుల రాకతో నగరంలో సందడి నెలకొంది. చిత్ర దర్శకుడు బాబీ, నటుడు బాబీ డయోల్, హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలాను చూసి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment