అనంతపురం కక్కలపల్లి మండీలో శనివారం కిలో టమాట గరిష్ట ధర రూ.15 పలికింది. కనిష్టం రూ.7, సరాసరి రూ.10 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.
చీనీ టన్ను రూ.20 వేలు
అనంతపురం మార్కెట్‌యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.20 వేలు పలికాయి.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టం ప్రకారం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీని ఏర్పాటు చేశారు. జంతలూరు వద్ద శాశ్వత క్యాంపస్‌ను గతేడాది నుంచి నిర్వహిస్తున్నారు. 2018లో జేఎన్‌టీయూ అనంతపురంలో తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. 2023–24, 2024–2025లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.112.08 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, 2025–26 విద్యా సంవత్సరానికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేకంగా నిధులు మాత్రం కేటాయించలేదు. వర్సిటీలో మరికొన్ని బ్లాక్‌లు నిర్మించాల్సి ఉంది. రోడ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నా నిధుల కేటాయించకపోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే వర్సిటీ పురోగతికి మరికొంత కాలం వేచి ఉండక తప్పని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment