అనంతపురం అర్బన్: ప్రతి ఉద్యోగి బాధ్యతగా పనిచేయాలని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను ఆయన శనివారం తన చాంబర్‌లో స్వీకరించారు. ఈ సందర్భంగా శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు, సబ్ ట్రెజరీ అధికారులు, జిల్లా ఖజానా శాఖ సీనియర్, జూనియర్ అకౌంటెంట్లతో తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బాధ్యతలను విస్మరిస్తే మన ద్వారా ప్రజలకు అందే సేవల్లో నాణ్యత లోపిస్తుందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలన్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే సహించబోనని స్పష్టం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. విమర్శలకు, ఆరోపణలకు తావివ్వకుండా సుహృద్భావ వాతావరణంలో పనిచేసి ఖజానా శాఖ ప్రతిష్ట పెంచాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment