పేగుబంధం పెనవేసుకుని.. గుండెల్ని హత్తుకుని!
సృష్టిలో అమ్మకన్నా విలువైనది ఏదీ లేదు. కడుపులో బిడ్డ పడిందని తెలియగానే ఆమె ఆనందం అంతా ఇంతా కాదు. నవమాసాలు కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ప్రాణాలు పోయేంతటి బాధనూ తట్టుకుని బిడ్డకు ప్రాణం పోస్తుంది. అలా పేగుబంధాన్ని పంచిన తల్లికి కష్టం కలగకుండా ఆమె కుమార్తె తీసుకెళ్లిన తీరు పలువురిని కదిలించింది.
రాప్తాడుకు చెందిన నాగమునెమ్మకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు సంతానం. నాగమునెమ్మ ఇటీవల పక్షవాతం బారిన పడింది. ఈ క్రమంలో తల్లికి వైద్య పరీక్షలు చేయించేందుకు ఆమె కుమార్తె ప్రమీల బుధవారం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకొచ్చారు. తిరుగు ప్రయాణంలో స్కూటీపై ఇదిగో ఇలా తల్లి ఎలాంటి ఇబ్బంది పడకుండా నడుముకు తాడుతో కట్టుకుని తీసుకెళ్లి గుండెల్ని హత్తుకున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment