హనుమద్వాహనం.. శ్రీవారి రాజసం
బుక్కరాయసముద్రం: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కొండమీద రాయుడు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. స్వామిని ప్రత్యేకంగా అలంకరించి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ పుర వీధుల్లో ఊరేగింపు చేపట్టారు. మహిళలు శ్రీవారికి మంగళ హారతులు పట్టారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సోమవారం రాత్రి శ్రీవారిని గరుడు వాహనంపై ఊరేగించనున్నట్లు అర్చకులు శ్రీనాథ్ స్వామి పేర్కొన్నారు.
నేటి నుంచి ‘పది’ ప్రీ ఫైనల్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి ప్రీఫైనల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రశ్నపత్రాలు ఆయా మండలా ల్లోని ఎమ్మార్సీలకు తరలించారు. సోమవారం మొదటి లాంగ్వేజ్, 11న ద్వితీయ లాంగ్వేజ్, 12న ఇంగ్లిష్, 15న గణితం, 17న ఫిజికల్ సైన్స్, 18న బయాలజికల్ సైన్స్, 20న సోషల్ పరీక్ష ఉంటుందని డీఈఓ ఎం.ప్రసాద్‌బాబు, డీసీఈబీ కార్యదర్శి గంధం శ్రీనివాసులు తెలిపారు.
కూతుర్ని పంపమంటూ
పదేపదే వేధించాడు
● అధికారుల ఎదుట కన్నీటిపర్యంతమైన నాగమునెమ్మ
తాడిపత్రిటౌన్: రేషన్ కార్డు కోసం వెళ్లిన ప్రతిసారీ నీ కూతుర్ని పంపు అంటూ వీఆర్‌ఓ చంద్రశేఖర్ వేధించాడంటూ అధికారుల ఎదుట నాగమునెమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం వీఆర్‌ఓ కీచక పర్వంపై ఏఎస్పీ రోహిత్‌కుమార్‌చౌదరి,ఆర్‌డీఓ కేశవనాయుడు, తహసీల్దార్ రజాక్‌వలి, సీఐ సాయిప్రసాద్ విచారణ చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు నాగమునెమ్మను విచారించారు. ‘కూతుర్ని పంపు అని వీఆర్వో ఎప్పుడు అన్నాడు, ఏ సమయంలో అన్నాడు, అన్నప్పుడు ఎవరెవరున్నారు’ అంటూ సీఐ సాయిప్రసాద్ ప్రశ్నించినట్లు తెలిసింది. రేషన్‌కార్డు కోసం వెళ్లిన ప్రతి సారీ ఆ మాట అన్నాడని, తాను ఒక్కదాన్నే ఉన్న సమయంలోనే అలా మాట్లాడాడని నాగమునెమ్మ చెప్పినట్లు సమాచారం. విచారణ అనంతరం బాధితురాలు విలేకరులతో మాట్లాడుతూ అన్యాయాన్ని అధికారులకు చెప్పుకున్నానని, న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్‌డీఓ కేశవనాయుడు మాట్లాడుతూ నాగమునెమ్మతో పాటు నిందితుడైన వీఆర్వో చంద్రశేఖర్‌ను, సచివాలయ సిబ్బందిని విచారించామన్నారు. వాదనలను రికార్డు చేశామని, నివేదికలను కలెక్టర్‌కు అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, నాగమునెమ్మను విచారిస్తున్న సమయంలో విలేకరులను అధికారులు లోనికి అనుమతించలేదు.
Comments
Please login to add a commentAdd a comment