![అశ్వత](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09tdp301fb-110121_mr-1739131950-0.jpg.webp?itok=VzHmNso0)
అశ్వత్థం.. భక్తజన సందోహం
పెద్దపప్పూరు: మండలంలోని చిన్నపప్పూరు సమీపంలో పెన్నానది ఒడ్డున వెలసిన అశ్వత్థనారాయణ స్వామి క్షేత్రానికి రెండవ ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఆలయ ఈఓ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీపీ గార్లదిన్నె బీసీ రామకృష్ణారెడ్డి, గ్రామ పెద్దలు పర్యవేక్షించారు. డాక్టర్ ఉషారాణి, హెల్త్ సూపర్‌వైజర్ శర్మాష్ వలి పర్యవేక్షణలో ఉచిత వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, సామాజిక సేవాసంస్ధల సభ్యులు శంకర్, పి.నారాయణ, గురప్ప, రామాంజినేయులు, పాండురంగ తదితరులు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
![అశ్వత్థం.. భక్తజన సందోహం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/10/09tdp301a-110121_mr-1739131950-1.jpg)
అశ్వత్థం.. భక్తజన సందోహం
Comments
Please login to add a commentAdd a comment