![విద్యుత్ బిల్లు.. ఘొల్లు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/power_mr-1739131953-0.jpg.webp?itok=YvMRnTMQ)
విద్యుత్ బిల్లు.. ఘొల్లు
పామిడి: విద్యుత్ బిల్లుల పెంపు పేదలకు పెను భారంగా మారింది. ఒకే సారి మూడు రెట్ల భారం మోపడంతో అన్ని వర్గాల నుంచి నిరసన పెల్లుబుకుతోంది. వస్త్ర వ్యాపారంలో రెండో ముంబైగా పేరుగాంచిన పామిడివాసులు కూటమి సర్కారు తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. మండలంలో 85 శాతం మంది కుట్టుమిషన్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. డ్రస్‌లను ఇంట్లోనే కుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. మహిళలు కుట్టుమిషన్లపై ఆధారపడి కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారంతా మిషన్లకు విద్యుత్ మోటార్లను అనుసంధానించి సులభంగా, వేగంగా దుస్తులు కుట్టేవారు. అయితే, ఇటీవల కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు భారీగా పెంచి మోయలేని భారం మోపడంతో వారంతా ఘొల్లుమంటున్నారు. గతంలో రూ.500 వచ్చే బిల్లు ఒక్కసారిగా రూ.1,500కు చేరడంతో వారి ఆవేదన అంతా ఇంతా కాదు.
ఒకేసారి మూడు రెట్లు పెంచిన
కూటమి ప్రభుత్వం
‘రెండో ముంబై’ పామిడివాసులపై
పెనుభారం
సర్కారు తీరుపై సర్వత్రా ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment