టీబీ డ్యాం నుంచి పీఏబీఆర్‌కు నీటి సరఫరా బంద్
● హంద్రీ–నీవా నుంచి
360 క్యూసెక్కుల సరఫరా
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)కు తుంగభద్ర జలాశయం నుంచి నీటి సరఫరా శనివారం నిలిచిపోయింది. ప్రస్తుతం హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువ ద్వారా 360 క్యూసెక్కుల నీరు పీఏబీఆర్‌లో చేరుతోంది. ఆదివారం నాటికి డ్యాంలో 3.70 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ధర్మవరం కుడి కాలువకు 705 క్యూసెక్కులు, అనంతపురం, సత్యసాయి, శ్రీరామరెడ్డి, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు రూ.55 క్యూసెక్కుల చొప్పున నీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో ఇన్‌ఫ్లో కంటే అవుట్ ఫ్లో ఎక్కువగా నమోదవుతోంది.
నేడు ‘పరీక్ష పే చర్చ’
● అన్ని పాఠశాలల్లో
ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి మాట్లాడేందుకు దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం నిర్వహించే ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో వీక్షించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఉదయం 11 గంటలకు దూరదర్శన్ ద్వారా డీడీ నేషనల్, డీడీ న్యూస్, డీడీ ఇండియా, రేడియో ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. https://www. youtube.com/ watch?v= G5Uhdwm-EEl లింక్ ద్వారా లైవ్‌లో చూడొచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు తెలిపారు. ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పదో తరగతి విద్యార్థులను కార్యక్రమానికి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. 6 నుంచి 9, ఇంటర్ విద్యార్థులందరూ వీక్షించేలా చర్యలు తీసుకోవాలని డీవైఈఓలు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లను డీఈఓ ఆదేశించారు.
15 మంది రైతుల తోటల్లో మోటారు వైర్ల అపహరణ
శింగనమల: మండలంలోని పెద్ద మట్లగొంది, చిన్న మట్లగొంది గ్రామాల్లోని 15 మంది రైతులకు చెందిన తోటల్లో శనివారం రాత్రి దొంగలు పడ్డారు. వ్యవసాయ బోరుబావుల్లోని మోటార్లకు ఏర్పాటు చేసిన విద్యుత్ కేబుల్‌ను అపహరించారు. ఒకే నెలలో మూడు సార్లు కేబుల్‌ను దుండగులు అపహరించుకెళ్లడం గమనార్హం. చోరీ జరిగిన ప్రతిసారీ రైతులు కొత్త వైర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటిని వారం తిరగకముందే మరోసారి దుండగులు అపహరించుకెళుతున్నారు. ఘటనపై ఆదివారం పోలీసులకు బాధిత రైతులు ఫిర్యాదు చేశారు.
టీబీ డ్యాం నుంచి పీఏబీఆర్‌కు నీటి సరఫరా బంద్
Comments
Please login to add a commentAdd a comment