![Lok Sabha Fourth Phase Schedule Nominations Strat On April 18th - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/16/AP-election-Nomination.jpg.webp?itok=TWWCIxRO)
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక, మే 13వ తేదీన పోలింగ్ జరుగనుంది.
కాగా.. ఏపీ, తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో నాలుగో విడతలో పోలింగ్ జరుగనుంది. పది రాష్ట్రాల్లో 96 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఎల్లుండి నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది.
షెడ్యూల్ ఇలా..
- ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ
- ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ
- ఏప్రిల్ 26 నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 29 నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం
- మే 13న పోలింగ్
- జూన్ 4న ఎన్నికల ఫలితాలు.
Comments
Please login to add a commentAdd a comment