సాక్షి, అమరావతి: విదేశాలకు వెళ్లే 45 ఏళ్లలోపు విద్యార్థులు, ఉద్యోగులకు టీకా వేయించాలంటూ అధికారులకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంపై ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలియచేశారు. విదేశాలకు వెళ్లడానికి టీకా తప్పనిసరి కావడంతో ఇండియాకు వచ్చిన వారు తిరిగి వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించి టీకా ఇవ్వాలని ఆదేశాలివ్వడంపై ఏపీఎన్‌ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి ప్రవాసాంధ్రుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
విదేశాలకు వెళ్లే వారు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లో ఆధార్ నంబర్ బదులుగా పాస్‌పోర్టు నంబర్ నమోదు చేసుకోవాల్సిందిగా ఎన్నారైలను కోరారు. పాస్‌పోర్టు, చెల్లుబాటు అయ్యే వీసా, కొత్త ఉపాధిలో చేరడానికి వెళ్లేవారు ఆ యాజమాన్యం నుంచి నియామక పత్రం, విద్యార్థులకు ప్రవేశ నిర్ధారణ సర్టిఫికెట్లు చూపించడం ద్వారా వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు హెల్ప్‌లైన్ నంబర్ 0863–2340678 లేదా వాట్సాప్ నంబర్ 8500027678లో సంప్రదించాల్సిందిగా కోరారు.
సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు
Published Thu, Jun 3 2021 6:27 AM | Last Updated on Thu, Jun 3 2021 6:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment