రాజంపేట : ఆయన డివిజన్ కేంద్రంలోని ఓ ఉన్నతాధికారి. ఇటీవల ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఇంతలోనే ఆయన తీరు వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే...తాను బంగ్లాలో ఉంటాను. ఉదయం 5గంటలకే సిబ్బంది రావాలని హకుం జారీచేశారు. అయితే మహిళా సిబ్బంది 5గంటలకు వెళ్లాలంటే జంకుతున్నారు. తాము కార్యాలయం పెట్టుకొని బంగ్లాకు ఎందుకు వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మహిళ సిబ్బంది తమకు పెట్టిన ఈ నిబంధన గురించి మీడియా ఎదుట వాపోయారు. వారు ధైర్యంగా చెప్పడానికి వెనుకంజ వేశారు. తాను చెప్పిన విధంగా రాని వారికి నోటీసులు ఇవ్వాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు కూడాజారీ చేసినట్లు తెలిసింది. ఈ ఉన్నతాధికారి విషయం టౌన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
గతంలో పనిచేసే ప్రదేశంలో...
ఇక్కడి రాకముందు గతంలో పనిచేసిన ప్రాంతంలో కూడా ఈ ఉన్నతాధికారి వివాదంలో చిక్కుకున్నారు. మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన సందర్భంలో ఆయన నడుచుకున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెలువెత్తిన సంగతి తెలిసిందే. అక్కడ రాత్రి 9గంటల తర్వాత ఫిర్యాదుదారులైన మహిళలతో మాట్లాడే అంశం వివాదానికి దారితీసింది. బాధితురాలు ధర్నాకు దిగంది. ఈ విషయం మీడియాలో వచ్చిన విధితమే. అక్కడి నుంచి ఆయనపై బదిలీవేటు పడింది.
బంగ్లాలో ఆఫీసు పనులు
రాని వారికి నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment