మూడు రోజుల్లో గృహాలకు జియో ట్యాగ్ పూర్తి చేయాలి
కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: రాబోయే మూడు రోజుల్లో జిల్లాలోని 5.48 లక్షల గృహాలకు సచివాలయ సిబ్బందితో యుద్ధ ప్రాతిపదికన జియో ట్యాగ్ పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఎంపీడీఓలను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి ఎంపీడీఓలు, డ్వామా ఏపీడీలు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులతో వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మూడు రోజుల్లోపు మంజూరైన ప్రతి గృహంతోపాటు వాటి ఇంటి నంబర్లను జియో ట్యాగింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎంపీడీఓలు అందరూ సచివాలయ సిబ్బందితో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి జియో ట్యాగింగ్ పని పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. పల్లె పండుగలో చేపట్టిన పనులు వందశాతం గ్రౌండ్ పూర్తి కావాలన్నారు. విద్యార్థులకు అపార్ ఐడీ త్వరితగతిన జనరేట్ చేయాలన్నారు. గ్రామాలలో ఉపాధిహామి పనులను విరివిగా కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ వెంకటరత్నం, పంచాయతీరాజ్ ఎస్‌ఈ దయాకర్ రెడ్డి, జీఎస్‌డబ్ల్యుఎస్ అధికారి లక్ష్మీపతి, ఎంపీడీఓలు, ఏపీడీలు, పంచాయతీ కార్యదర్శులు, మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment