సమస్యల ఏకరువు!
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు సీతమ్మ. పీలేరుకు చెందిన ఈమె నడవలేక మనిషి సాయంతో కలెక్టరేట్‌కు వచ్చింది. వృద్ధాప్య పెన్షన్ కింద రూ. 4 వేలు వస్తోంది. నడవలేని తనకు వృద్దాప్య పెన్షన్ కాకుండా మానవతా దృక్పథంతో వికలాంగుల పెన్షన్ అందించాలని కలెక్టరేట్‌లో ఇలా గోడ పట్టుకుని నడుస్తూ వచ్చి కలెక్టర్ శ్రీధర్‌ను కలిసి తన గోడు వెళ్లబోసుకుంది.
సాక్షి రాయచోటి : కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ప్రజల్లో నైరాశ్యం ఆవహించింది. వైఎస్సార్ సీపీ హయాంలో వరుసపెట్టి ప్రతినెలలోనూ ఏదో ఒక సంక్షేమం తలుపు తట్టేది. పింఛన్ల జాతర జరిగేది. ప్రస్తుత ప్రభుత్వం ఆయా సంక్షేమ పథకాలకు మంగళం పాడి.. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయకుండానే అటకెక్కించింది. దీంతో ప్రజలకు సంక్షేమం అందని ద్రాక్షగా మారింది. పంటలు సరిగా పండక రైతన్నకు ఏదో ఒక కష్టమో.. నష్టమో వెంటాడుతూనే ఉంది. పైగా అధికార పార్టీ నేతల భూ దాహానికి చాలా మంది బాధితులుగా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయా సమస్యలకు పరి ష్కారం చూపాలంటూ బాధితులు కలెక్టరేట్‌కు పరుగులు పెడుతున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా వికలాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం కలెక్టరేట్ తలుపు తట్టడం కనిపిస్తోంది. ప్రతి సోమవారం 300–350 మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో ఇక్కడికి వస్తున్నారు.
అత్యధికంగా రెవెన్యూ సమస్యలు
ప్రధానంగా భూములకు సంబంధించి ఆన్‌లైన్, అండగల్, భూ వివాదాలు, ఆక్రమణలు, కబ్జాలపై ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రతి శనివారం కలెక్టర్, జేసీ, ఆర్డీఓ చాంబర్లలో భూములకు సంబంధించి కోర్టు నిర్వహిస్తున్నా...సోమవారం కూడా భూ సమస్యలపైనే బాధితులు వస్తున్నారు. తగాదాల వల్ల పెండింగ్‌లో ఉన్న బాధితులతోపాటు.. ఇంటి పట్టాలు ఆక్రమణలు ఇలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఉన్నతాధికారులను కలుస్తున్నారు. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల ఆశలు అడియాశలు అవుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
రాయచోటిలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు రాకపోవడంపై కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా ప్రతిసోమవారం కార్యక్రమానికి ఉదయం 10 గంటల్లోపు రావాలని సీరియస్ అయ్యారు. కొంతమంది 11 గంటలకు రావడం.. మరికొంతమంది ఉన్నతాధికారులు రాకుండా కిందిస్థాయి సబార్డినేట్లను పంపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. రానున్న రోజుల్లో జరిగే కార్యక్రమాలకు హెచ్‌ఓడీలు రావడంతోపాటు బాధితుల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఫిర్యాదుదారులు సమస్యలను పరిష్కరించాలి
రాయచోటి : అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ కె.మధుసూధన్‌రావు, ఎస్డీసీ రామసుబ్బయ్య, ఆర్డీఓ శ్రీనివాస్ ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భక్త కనకదాస బాటలో నడుద్దాం
రాయచోటి : భక్త కనకదాస చూపిన బాటలో నడుద్దామని కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం భక్త కనకదాస జయంతి సందర్భంగా రాయచోటి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగదతుల సంక్షేమశాఖాధికారి సందప్ప, కురుబ సంఘం నాయకులు బండి రెడ్డప్ప, శివ, న్యాయవాది ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పెరుగుతున్న ఫిర్యాదులు
భూ సమస్యకు సంబంధించిన
బాధితులే అధికం
పలుమార్లు అధికారులకు విన్నవిస్తున్నా పరిష్కారానికి నోచుకోని సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment