భక్తిశ్రద్ధలతో తహలీల్ ఫాతెహా
కడప కల్చరల్ : కడప పెద్ద దర్గాలోని సయ్యద్‌షా ఆరీఫుల్లా మొహమ్మద్ మహమ్మదుల్ హుసేనీ చిష్ఠివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా సోమవారం తహలీల్ ఫాతెహా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పీఠాధిపతి సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ తమ స్వగృహం నుంచి ఫకీర్ల మేళతాళాలు, విన్యాసాల మధ్య ఊరేగింపుగా మహా నైవేద్యంగల పవిత్రమైన పాత్రను దర్గా ప్రాంగణంలోకి తీసుకు వచ్చారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాత్రలోని నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టారు. ఉరుసు ఉత్సవాల్లో తహలీల్ ఫాతెహాగా అందించే ప్రసాదం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. ప్రార్థనల అనంతరం దర్గా నిర్వాహకులు భక్తులందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ప్రధాన గురువుల మజార్ల వద్ద పీఠాధిపతి ప్రార్థనలు చేశారు.
మలంగ్‌షా దీక్ష విరమణ
ఉరుసు ఉత్సవాల ప్రారంభం నాడు తపోదీక్ష వహించిన మలంగ్‌షా సోమవారం దీక్ష విరమించారు. పీఠాధిపతి సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ శిష్య గణంతో కలిసి ఊరేగింపుగా వెళ్లి మలంగ్‌షాను స్వయంగా దీక్ష విరమింపజేశారు. అనంతరం భక్తులు పెద్ద ఎత్తున అట్టహాసంగా మేళతాళాలు, సాహస విన్యాసాలతో మలంగ్‌షాను దర్గా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయించారు. దర్గా ముజావర్ అమీర్ పర్యవేక్షణలో కార్యక్రమాలు జరిగాయి.
రామ్‌చరణ్ ప్రత్యేక ప్రార్థనలు
నటుడు రామ్‌చరణ్‌తేజ్ పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. సోమవారం రాత్రి జరిగిన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కడపకు వచ్చిన ఆయన శ్రీ విజయదుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పెద్దదర్గాకు చేరుకున్నారు. దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన ముషాయిరాలో పాల్గొన్నారు. సినీ నటుడు రామ్‌చరణ్ వెంట దర్శకుడు బుచ్చిబాబు, అభిమాన సంఘం నాయకులు వచ్చారు.
మలంగ్‌షాచే దీక్ష విరమింపజేసిన పీఠాఽధిపతి
భక్తులకు మహానైవేద్యం పంపిణీ
ప్రత్యేక అతిథిగా సినీ నటుడు రామ్‌చరణ్‌తేజ్
Comments
Please login to add a commentAdd a comment